Site icon NTV Telugu

Poonakalu Loading: మెగా మాస్ మోడ్ కి స్విచ్ అవ్వండ్రా అబ్బాయిలు… పూనకలు లోడింగ్

Poonakalu Loading

Poonakalu Loading

మాస్ మూలవిరాట్ మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిస్తే ఏ హీరో అభిమానికైనా పూనకలు రావాల్సిందే, థియేటర్ లో విజిల్స్ తో మోత మొగించాల్సిందే. ఇదే ప్లాన్ చేసిన దర్శకుడు బాబీ… వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే సాంగ్ ని పెట్టేసి చిరు, రవితేజ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాకే మెయిన్ హైలైట్ అవనున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా వదిలిన పోస్టర్ లో చిరు, రవితేజలు మాస్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి దుమ్ము లేపే డాన్స్ చేస్తున్న ఫోజ్ ఇచ్చారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు ఒకరిని ఒకరు చూసుకుంటూ, సంక్రాంతి యుద్ధానికి సిద్ధం అనేలా ఉన్నారు.

‘మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా బయటకి రానున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ గురించి దర్శకుడు బాబీ ట్వీట్ చేస్తూ “My two idols, My two heroes& My two biggest strengths Coming together to give you all Mass Poonakalu with a Mega Mass Song of the year” అంటూ కోట్ చేశాడు. బాబీ ఈ సాంగ్ విషయంలోనే కాదు ‘వాల్తేరు వీరయ్య’ అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే క్యాప్షన్ ని వాడుతూనే ఉన్నాడు, పోస్టర్స్ లో కూడా ఆ పదం కనిపిస్తూనే ఉంది. పూనకలు లోడింగ్ అంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మెగా అభిమానులకి, రవితేజ అభిమానులకి కిక్ ఇచ్చేలా ఉంటుందేమో అనుకున్నారు కానీ ఈ పేరుతో ఒక సాంగే సినిమాలు ఉందనే విషయాన్ని ఇప్పటివరకూ సీక్రెట్ గానే ఉంచారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలని ఆకాశమంత ఎత్తుకి తీసుకోని వెళ్లడానికి బయటకి రానున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ బయటకి వస్తే న్యూ ఇయర్ వేడుకల్లో రిపీట్ మోడ్ లో వినిపించడం గ్యారెంటి.

Exit mobile version