Site icon NTV Telugu

Pooja-Hegde : టాలీవుడ్‌కి కమ్‌బ్యాక్ చేస్తున్న పూజా హెగ్డే.. షాకింగ్ రెమ్యునరేషన్

Poojahegde

Poojahegde

టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో చాలాకాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నది గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే.

ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా ఆమె భారీ పారితోషికం కారణంగానే టాలీవుడ్‌కు దూరమయ్యారని అప్పట్లో ఓ టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇస్తూ అదే స్థాయిలో పారితోషికం అందుకుంటోందని సమాచారం. ఈ మూవీలో నటించేందుకు పూజా ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇది ఆమె మార్కెట్‌ ఇంకా ఎలాంటి స్థాయిలో ఉందో చూపిస్తున్నది.

ఇక రీసెంట్‌గా రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న కూలీ మూవీలో ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌లో పూజా చేసిన స్పెషల్ అప్పియరెన్స్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలో ఆమె గ్లామర్, ఎనర్జీ స్క్రీన్‌పై హైలైట్‌గా నిలిచాయి. ఈ ఫ్యాక్టర్‌తోనే ఆమెకు మళ్లీ సౌత్‌లో క్రేజ్ పెరిగిందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దుల్కర్‌తో కలిసి నటిస్తున్న ఈ కొత్త తెలుగు సినిమా, పూజా కెరీర్‌కు మరోసారి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందా? . అభిమానులు కూడా ఆమె రీ-ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version