Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వడంతో ఆమె ఆరోగ్యంపై పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. సామ్ చర్మ సమస్యలతో బాధపడుతుందని కొందరు, సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ఆమెకు ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది సామ్ అభిమానుల ప్రశ్న. ఏది ఏమైనా ఈ వారంలో సామ్ అమెరికా నుంచి తిరిగి రానుంది. వచ్చాకా ఈ పుకార్లపై నోరు విప్పుతుందేమో చూడాలి. ఇక సామ్ గురించి పక్కన పెడితే.. మరో స్టార్ హీరోయిన్ కూడా సర్జరీ బాట పట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఎన్నోరోజులుగా ఆమె తన ముక్కు బబాగోలేదని మదనపడుతున్నదట.. దానివల్లనే కొన్ని అవకాశాలు కూడా రావడం లేదని ఆమె భావిస్తున్నదట.
ఇక ఈ ముక్కును ఎలాగైనా సరి చేసుకోవాలని పలువురు సలహా ఇవ్వడంతో ఈ ముద్దుగుమ్మ సర్జరీకి సిద్దమయ్యిందని తెలుస్తోంది. ఇక మరో వారం రోజుల్లో బుట్ట బొమ్మ అమెరికా ప్రయాణం కట్టనున్నదని తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం తెలియడంతో అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముక్కు బావున్నా..బాగోలేక పోయినా అవకాశాలు బాగానే వస్తున్నాయి.. ఇప్పుడు సర్జరీ చేయించుకోవడం అవసరమా అని కొందరు.. ఏంటి సమంతకు పోటీనా.. ఆమె చేయించుకుందని నువ్వుకూడా సర్జరీ చేయించుకుంటున్నావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.