సౌత్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే నార్త్ లో సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా జాన్ కిసీ కి భాయ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఫర్హాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఈద్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి అవుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెడ్గే, సల్మాన్ ఖాన్ డేటింగ్ చెయ్యడం స్టార్ట్ చేసారనే రూమర్స్ బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ పూజా, సల్మాన్ లపై రూమర్స్ మాత్రం బీటౌన్ లో ఆగట్లేదు. నేషనల్ మీడియా పబ్లిష్ చేస్తున్న ఆర్టికల్స్ ప్రకారం సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేని తను చెయ్యబోయే నెక్స్ట్ రెండు సినిమాలకి కూడా సైన్ చేసాడని సమాచారం.
Read Also: Bhandavi Sridhar: అర్థంపర్థం లేకుండా ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి పిల్లా?
ఇందులో ఒకటి ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న ‘పవన్ పుత్ర భాయ్ జాన్’. ఇండస్ట్రీ హిట్ అయిన ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్న విజేంద్రప్రసాద్, ‘పవన్ పుత్ర భాయ్ జాన్’ టైటిల్ ని సీక్వెల్ కోసం లాక్ చేసాడట. మొదటి పార్ట్ లో సల్మాన్ ఖాన్ పక్కన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. సెకండ్ పార్ట్ లో మాత్రం కరీనా ప్లేస్ లో పూజా హెగ్డే కనిపించనుందని బీటౌన్ వర్గాల సమాచారం. కరీనాని రీప్లేస్ చేస్తూ పూజాని సల్మాన్ ఖాన్ స్వయంగా డెసిషన్ తీసుకున్నాడు అని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సింది ఉంది.
