అంతర్జాతీయంగా పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి పలువురు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి వారు ఈ ఫెస్టివల్ కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవారు. ఇక మకి కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఈవెంట్ నిర్వాహకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారిని ఆహ్వానించారట. మే 17న ప్రారంభమై 28న ముగిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడవడానికి డస్కీ సైరన్ పూజా హెగ్డే, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఫెస్టివల్ లో పాల్గొనటానికి పూజా హేగ్డే సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ నుండి రెండు రోజులు రెస్ట్ తీసుకోనుందట. ఇక F3 ప్రమోషన్ జోరుగా కొనసాగుతుండటంతో తమన్నా ఓపెనింగ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వస్తుందట. వీరిద్దరితో పాటు, ఎ.ఆర్.రెహమాన్, అక్షయ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారట. అలాగే టీవీ తారటు హీనా ఖాన్, హెల్లీ షా కూడా సందడి చేయబోతున్నారట.
Cannes Film Festival: కేన్స్ లో తమన్నా, పూజ ర్యాంప్ వాక్

Canees