Site icon NTV Telugu

Pooja Hegde: అదొక చెత్త సినిమా.. దానివల్లే నాకు ఆఫర్స్ రాలేదు

Pooja

Pooja

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. పాన్ ఇండియా సినిమాలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడున్న స్టార్ స్టేటస్ కన్నా ముందు అమ్మడు ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న సంగతి చాలామందికి తెలియనిది. ఆమె నటించిన ప్రతి సినిమా ప్లాప్ తెచ్చుకోవడంతో ఆమెకు ఐరన్ లెగ్ అని ముద్ర వేసేశారు. మధ్యలో ‘అరవింద సమేత’ హిట్ అందుకోవడంతో అమ్మడి కెరీర్ మారిపోయింది .. ఆ తర్వాత వరుస హిట్లు, ప్లాపులు అందుకున్నా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఒక్కసారిగా ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నా పూజా ఫై ఇంకా ఐరన్ లెగ్ ముద్ర ఉందనే అంటున్నారు పలువురు. ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ చిత్రాలతో మరోసారి ఆ పేరును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన జీవితాల్లో ఒక చెత్త సినిమాలో నటించి అవకాశాలను పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకీ అమ్మడు చెప్పిన చెత్త సినిమా ఏంటో కాదు ఆమె బాలీవుడ్ డెబ్యూ ‘మొహంజదారో’. స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ డెబ్యూ అనేసరికి అమ్మడి ఆనందనానికి పట్టపగ్గాలు లేవు.. అప్పట్లో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది. అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత అమ్మడికి ఒక ఏడాది పాటు సినిమాలు రాలేదు. ఈ విషయాన్ని పూజా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

“నేను వరుసగా నటించిన 6 సినిమాలు హిట్లు అవ్వడం నా కెరీర్ లో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని ఫీల్ అవుతాను. ఇక లోయెస్ట్ పాయింట్ ఏది అంటే.. ‘మొహంజదారో’ అని చెప్తాను. అదొక చెత్త సినిమా.. నా కెరీర్ లో ,లీస్ట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అదే అని చెప్తాను. ఈ సినిమా ప్లాప్ తరువాత ఏడాది పాటు అవకాశాలు రాలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version