NTV Telugu Site icon

Pooja Hegde: కారు గిఫ్ట్ ఇచ్చినా బావుండేది.. ఏంటి పూజా అంత మాట అనేశావ్

Pooja

Pooja

Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్న విషయం తెల్సిందే. గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐరెన్ లెగ్ గా మారింది. ఇక ఆ ట్యాగ్ నుంచి తప్పించుకోవడానికి అమ్మడు మస్తు కష్టపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే పూజా నటించిన కిసికి జాన్ కిసికా భాయ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సల్మాన్ ఖాన్ సరసన పూజా మొదటిసారి కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపైనే పూజా ఆశలన్నీ పెట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచేస్తోంది బుట్టబొమ్మ.

Vikram: అన్నా.. నీకు పెళ్లీడు కొచ్చిన కొడుకు ఉన్నాడు.. నువ్వే ఇలా ఉంటే ఎలా..?

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా.. తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. గత కొన్ని రోజులుగా పూజాకు ఒక నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ విషయమై అడుగగా అమ్మడు కొద్దిగా సీరియస్ అయ్యింది. “నా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వాటిని నేను చదువుతూ ఉంటా.. కానీ, ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తూ కూర్చోలేను. ఒక్కోసారి మా పేరెంట్స్ కూడా వీటిని నిజమేనా అని అడుగుతుంటారు. మొన్నీమధ్య కూడా నేను ప్రస్తుతం పని చేస్తున్న మూవీ నిర్మాత.. నాకు ఒక కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు వచ్చాయి. నా గురించి అంత చెడుగా చెప్పాలనుకొంటే నాకు ఒక కారు కొనివ్వండి” అంటూ ఫైర్ అయ్యింది. అదేంటి పూజా అంత మాట అనేశావ్.. రూమర్స్ అనేవి ఇండస్ట్రీలో సాధారణమేగా .. అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments