బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం పూజా, విజయ్ దేవరకొండ- పూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనగణమణ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమా కాకుండా మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నుంచి పూజా తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటివరకు ఈ వార్తలపై పూజా స్పందించకపోవడం విశేషం. ఇక తాజాగా బుట్టబొమ్మ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కెజిఎఫ్ 2 తరువాత ఏ సినిమా చేస్తున్నాడు అనేది మిస్టరీగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం యష్ తన తదుపరి చిత్రాన్ని కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వంలో చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కన్నడలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని పంపీణి చేసిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నదని సమాచారం.
ఇక ఈ సినిమాలో యష్ సరసన పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్.. ఇక ఇప్పటికే పూజాకు కథ చెప్పడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం కూడా జరిగిందని టాక్.. ఈ సినిమాను కూడా మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో తెరక్కిస్తున్నారట.. ఈ వార్తే కనుక నిజమైతే పూజా లక్ మాములుగా లేదని చెప్పాలి.. రాధేశ్యామ్ నుంచి ఇప్పటివరకు అమ్మడు పాన్ ఇండియా మూవీస్ లోనే నటిస్తూ వస్తుంది. ఇక యష్ సరసన నటించడం అంటే బుట్టబొమ్మకు కలిసివచ్చినట్లే అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
