NTV Telugu Site icon

Pooja Hegde: మరోసారి మెగా ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ.. ?

Pooja

Pooja

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. రెండేళ్లుగా ఈ భామకు హిట్ అన్నది లేదు. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా.. ? అంటే.. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే పోతున్నాయి. గుంటూరు కారం సినిమాలో పూజా తప్పుకుంది. డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతోనే ఆమె తప్పుకుంది కానీ, వేరే ఇతర కారణాలు ఏవి లేవని గుంటూరు కారం మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక అంత డేట్స్ అడ్జస్ట్ చేయలేని బిజీగా పూజా ఏ సినిమాలు చేస్తోంది అనేది మాత్రం ఎవరికి అంతుచిక్కని విషయం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఎట్టేకలకు ఈ చిన్నది చాలా గ్యాప్ తరువాత పెద్ద ప్రాజెక్ట్ పట్టేసింది. మెగా ఫ్యామిలీలో మరోసారి అడుగుపెట్టింది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జతకట్టింది. అన్ని బావుంది ఉంటే.. ఉస్తాద్ లో పవన్ సరసన కూడా నటించేది. కానీ, అది కుదరలేదు.

Joju George: పాన్ ఇండియా మూవీగా జోజు జార్జ్ ”ఆంటోని”.. దసరాకి స్పెషల్ ట్రీట్!

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. పూజా.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన గాంజా శంకర్ లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. విరూపాక్ష సినిమాతో మంచి రీ ఎంట్రీ ఇచ్చినతేజ్.. తన తదుపరి సినిమాలను ఏరికోరి ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే తేజ్ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవి కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో తేజ్ సరసన పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం. అయితే ఆమె డేట్స్ ఇచ్చిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. మరి ఇదే కదా నిజమైతే.. అమ్మడు కెరీర్ దీనిమీదనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో పూజా మరోసారి రేస్ లోకి వస్తుందో లేదో చూడాలి.

Show comments