NTV Telugu Site icon

PS-2: కమల్ చెప్తే చూసేస్తారా? ఇంకా తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

పొన్నియిన్ సెల్వన్… చోళుల కథతో తెరకెక్కిన లార్జ్ స్కేల్ సినిమా. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినా కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వలేకపోయింది. తమిళ నెలకి సంబంధించిన చరిత్ర కాబట్టి తమిళ నేటివిటీ ఉండడంలో తప్పులేదు కానీ ప్రమోషన్స్ చేసే సమయంలో, మేకర్స్ ఇది ‘అరుణ్ మొలి’ కథ అనో, తమిళ రాజుల కథ అనో చెప్పకుండా… మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఇండియాస్ గ్రేటెస్ట్ కింగ్ ‘రాజరాజ చోళ’ కథ అని ఒక్క మాట చెప్పి ఉంటే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యేది, ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే వాళ్లు. ఈ తప్పుని తెలిసో తెలియక మొదటి పార్టులో చేసిన మేకర్స్, సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం తెలిసి తెలిసే చేస్తున్నట్లు ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా రిలీజ్ మరో అయిదు రోజుల్లో ఉంది.

ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది కానీ తమిళనాడు మినహా ఎక్కడా ప్రమోషన్స్ మాత్రం చెయ్యట్లేదు. తూతూ మంత్రంగా ఒక ఈవెంట్ చేస్తున్నారు కానీ బజ్ జనరేట్ చెయ్యట్లేదు. లేటెస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కోసం ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్ ని కమల్ హాసన్ తో చెప్పించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో కూడా తమిళ భాషలోనే ఉంది కానీ ఇతర భాషలకి సంబంధించిన వీడియోలని రిలీజ్ చెయ్యలేదు. అసలే పార్ట్ 1కి తమిళ సినిమా అనే మరకని అంటించుకున్నారు, పార్ట్ 2కి అయినా వదిలించుకుంటారానుకుంటే మణిరత్నం అండ్ టీం పార్ట్ 2 విషయంలో మరింత దారుణంగా తయారయ్యారు. ఇలా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేలా సినిమా చేసినప్పుడు పాన్ ఇండియా అనే పదాలు వాడకుండా ఉంటే బాగుంటుంది.

Show comments