Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా తమిళనాట విజయం సాధించినా తెలుగులో మాత్రం ఆదరణ దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ 28, 2023న విడుదల చేయబోతున్నారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారం. ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు, ప్రకాశ్ రాజ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, పార్తిబన్, జయరామ్ ఇందులోని ఇతర ముఖ్య పాత్రధారులు.
అత్యధిక వసూళ్ళు సాధించిన తమిళ చిత్రంగా తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రెండో భాగం ఎలాంటి విజయం సాధిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరో విశేషమేమంటే రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే ‘పొన్నియిన్ సెల్వన్-2’ ను రిలీజ్ చేయబోవడం! ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రెస్ మీట్ లో మణిరత్నం స్వయంగా తాను ఈ సినిమా తీయడానికి రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో చూపిన బాటనే ప్రేరణ అన్నారు. అదే తీరున ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగాన్ని, ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ నే ఎంచుకోవడంతో మణి, రాజమౌళిని ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థమవుతోంది.
#CholasAreBack #PS2 🏹☀️ is releasing soon on April 28th, 2023 in Cinemas Worldwide. #PonniyinSelvan #ManiRatnam @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @PrimeVideoIN #PS1 pic.twitter.com/BfJ1PSxnSg
— A.R.Rahman (@arrahman) December 28, 2022
