Ponniyin Selvan 2: ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ న ‘పొన్నియిన్ సెల్వన్ 2’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా తమిళనాట విజయం సాధించినా తెలుగులో మాత్రం ఆదరణ దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ 28, 2023న విడుదల చేయబోతున్నారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారం. ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు, ప్రకాశ్ రాజ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, పార్తిబన్, జయరామ్ ఇందులోని ఇతర ముఖ్య పాత్రధారులు.
అత్యధిక వసూళ్ళు సాధించిన తమిళ చిత్రంగా తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రెండో భాగం ఎలాంటి విజయం సాధిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరో విశేషమేమంటే రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే ‘పొన్నియిన్ సెల్వన్-2’ ను రిలీజ్ చేయబోవడం! ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రెస్ మీట్ లో మణిరత్నం స్వయంగా తాను ఈ సినిమా తీయడానికి రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో చూపిన బాటనే ప్రేరణ అన్నారు. అదే తీరున ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగాన్ని, ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ నే ఎంచుకోవడంతో మణి, రాజమౌళిని ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థమవుతోంది.
Also Read
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
#CholasAreBack #PS2 🏹☀️ is releasing soon on April 28th, 2023 in Cinemas Worldwide. #PonniyinSelvan #ManiRatnam @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @PrimeVideoIN #PS1 pic.twitter.com/BfJ1PSxnSg
— A.R.Rahman (@arrahman) December 28, 2022
తాజావార్తలు
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..