NTV Telugu Site icon

Ponniyin Selvan 2: అప్పుడే అంత కలెక్ట్ చేసిందా…

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

మూవీ మేకింగ్ మాస్టర్ గా ఇండియన్ సినిమాకే కొత్త రంగులు అద్దిన వాడు మణిరత్నం. ఈ డైరెక్టర్ సినిమాలని, ఆయన టేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ ని ఇష్టపడని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మణిరత్నంకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు పొన్నియిన్ సెల్వన్ అని తెలియగానే తమిళ ఆడియన్స్ అంతా వాళ్లకి ఒక బాహుబలి దొరికిందని ఫీల్ అయ్యారు. మణిరత్నం మాములు సినిమాలే మాస్టర్ పీస్ అనిపించేలా చేస్తాడు కాబట్టి పొన్నియిన్ సెల్వన్ సినిమాని ఇంకెంత స్పెషల్ గా చేస్తాడో అనుకున్నారు. కల్కి రాసిన నవల ఆధారంగా చేసుకోని రెండు భాగాలుగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పార్ట్ 1 500 కోట్లు కలెక్ట్ చేస్తే పార్ట్ 2 మొదటి రోజే దాదాపు 34 కోట్ల వరకూ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఓవర్సీస్ లో కూడా పొన్నియిన్ సెల్వన్ 2కి ఆడియన్స్ జేజేలు కొడుతున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి 1.6 మిలియన్ కలెక్ట్ చేసిన ఈ మూవీ, 2 మిలియన్ ని చేరుకోవడానికి రెడీగా ఉంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2కి పాజిటివ్ టాక్ ఇంకా ఎక్కువ రావడం, సినిమా ఎంగేజింగ్ గా ఉండడం, మణిరత్నం మేకింగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉండడంతో పొన్నియిన్ సెల్వన్ 2కి బుకింగ్స్ మధాహ్నం షో నుంచి మరింత పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ మూవీ PS-2ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నారు కానీ ఆ మూవీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పొన్నియిన్ సెల్వన్ 2కి తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నార్త్ లో PS-2 చాలా వీక్ గా కనిపిస్తోంది, అక్కడ కూడా పుంజుకుంటే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2, పార్ట్ 1ని మించడం పెద్ద కష్టమేమి కాదు.