కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో కోలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలని పండగకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక సినీ అభిమానులు ఏ ఫీలింగ్ లో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక సీజన్ లో రిలీజ్ అవ్వడం మాములే కానీ ఒకే డేట్ ని రిలీజ్ అవ్వడం అనేది అరుదుగా జరిగే విషయం. ఈ అరుదైన విషయమే కోలీవుడ్ లో ఇప్పుడు జరుగుతుంది. తునివు, వారిసు సినిమాలు జనవరి 11నే ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్స్ దొరకవేమో అనే భయంలో ఫాన్స్ ఉన్నా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ చేసి రెండు సినిమాలని ఒకే డేట్ ని విడుదల చేస్తున్నారు.
మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షో పడనుండడంతో అజిత్ మరియు విజయ్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. దాదాపు ఎర్లీ మార్నింగ్ టైంకి వారిసు హిట్ అయ్యిందా లేక తునివు హిట్ అయ్యిందా లేక రెండు సినిమాలు హిట్ అయ్యి 2023లో కోలీవుడ్ కి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చాయా అనే విషయం తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే పొంగల్ బాక్సాఫీస్ వార్ తమిళనాడు వరకే పరమితం అయ్యింది తెలుగులో అజిత్ జనవరి 11న సోలో గానే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. విజయ్ నటిస్తున్న వారిసు సినిమా తెలుగులో జనవరి 14న రిలీజ్ అవుతోంది. దీంతో అజిత్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎడ్జ్ దొరికింది. మరి అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ‘తెగింపు’ సినిమా హెల్ప్ అవుతుందేమో చూడాలి.