Police Security For Pathan Film On Release Day: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత షారుఖ్ నుంచి సినిమా వస్తున్న నేపథ్యంలో.. ‘పఠాన్’ కోసం అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. కానీ.. హిందూ సంఘాలు మాత్రం ఈ సినిమా చాలా గుర్రుగా ఉన్నాయి. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇందులోని బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాషాయం రంగు బికినీనే అందుకు కారణం.
NBK X PSPK Power Teaser: అన్‌స్టాపబుల్ ప్రశ్నలతో పవన్‌కి బాలయ్య ఫిట్టింగ్స్..?
అసలు ఆ పాట విడుదలైనప్పుడే ఎంత దుమారం రేగిందో అందరూ చూశారు. హిందూ సంఘాల దగ్గర నుంచి బీజేపీ నేతల దాకా.. ఆ మాటపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని తొలగించాలని, లేకపోతే సినిమానే బాయ్‌కాట్ చేస్తామంటూ డిమాండ్లు చేశారు. దీంతో.. దానికి చిత్రబృందం కత్తెర వేసింది. అయినా సరే.. హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంటే, కొన్ని థియేటర్ల వద్ద ఘర్షణకు దిగారు. పోస్టర్లను తొలగించడం, కాలితో తన్నడం లాంటివి చేస్తున్నారు. గుజరాత్‌లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. గుజరాత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పఠాన్ సినిమా ప్రదర్శింపబడే ప్రతీ థియేటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల్ని మోహరిస్తోంది.
Pakistan: బలూచిస్తాన్ లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ట్రైన్.. 15 మంది..
థియేటర్ వద్ద ఎవరైనా ఆందోళన చేసినా.. లేకపోతే థియేటర్ లోపల ఏమైనా రచ్చ చేసినా.. వారిని వెంటనే అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో.. కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లోనూ థియేటర్లకు భద్రత కల్పించాలని యూనిట్ వర్గాలు కోరుతున్నాయి. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో పోలీసులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. మరి, సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
