NTV Telugu Site icon

WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?

Shyam

Shyam

WeWantJusticeForShyamNTR: ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది. జూన్ 24 న శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఆత్మహత్య కాదని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో.. ఇప్పుడు శ్యామ్ మృతి పట్ల సందిగ్దత నెలకొంది. శ్యామ్ మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయని, పోలీసులు క్షుణ్ణంగా విచారించాలని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇక వారికి అండగా మిగతా హీరోల ఫ్యాన్స్ సైతం అండగా ఉండడం విశేషం. ఇక ఈ విషయమై ఎన్టీఆర్ సైతం స్పందించాడు. “శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఈ శ్యామ్ మృతి పోలీసులు కూడా స్పందించారు.

Weight Loss: బరువు తగ్గాలంటే ఇవి తినండి.. రిజల్ట్ కొద్ది రోజుల్లోనే..!

కోనసీమ డీఎస్పీఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడారు. ” జూన్ 25 ఉదయం కడలివారిపాలెం గ్రామం లోని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ రాగా కోతపేట సిబ్బంది తో పాటు రావులపాలెం CI గారు సంఘటన స్థలానికి చేరుకొని వెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యక్తి మణికట్టు దగ్గర బ్లేడ్ తోటి కట్ చేసుకున్నాట్టుగా తర్వాత చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నట్టుగా ఉంది. అతని పాకెట్ లో సెర్చ్ చేస్తే బ్లేడ్ దొరికింది అలాగే ఒక ఫోను కూడా దొరికింది అతని పేరు “మేడిశెట్టి శ్యాంమణికంఠ రాంప్రసాద్, S/o. శ్రీనివాస్ A/21 నేటివ్ కాట్రేనికోన మండలం. అతని తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా తిరుపతి వెళ్లి అక్కడ తాపి పని చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అతను వారి పెద్దమ్మ గారి ఇంటికి వచ్చాడు ఇక్కడ గత మూడు నెలలుగా ఉంటున్నాడు. ఈ మధ్య మళ్ళీ తిరుపతి వెళ్లి 15 రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఈ అబ్బాయి కి సొంత కారణాల వలన ఉరి వేసుకున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది, అతని తల్లిదండ్రులు గాని వేరే వాళ్ళు ఏ విధమైన అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. బాడీ ని పోస్టుమార్టం కి పంపించాము, రిపోర్ట్ వస్తుంది. ఈ కేసులో ఏదైనా సందేహం ఉన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే కేసును నిస్పక్షపాతముగా మేము దర్యాప్తు చేస్తాం” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.