‘పాయిజన్’ మూవీ ట్రైలర్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమణ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పాయిజన్’. రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక ఈ సినిమా నిర్మించారు. గురువారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లోని ఏఎంబీ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ”ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూసిన భావన కలుగుతోంది. ఈ చిత్ర నిర్మాత గురించి నాకు తెలుసు. సినిమా అంటే ప్రాణం పెడతారు. దర్శకుడు రవిచంద్రన్ మా కాంపౌండ్ వ్యక్తి. హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది. యూత్ అంతా ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది” అని అన్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోందని, ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశారని నిర్మాత పుప్పాల రమేశ్ చెప్పారు. ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచి, హీరో రమణ, దర్శకుడు రవిచంద్రన్ లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాలనే ఆకాంక్షను లయన్ సాయివెంకట్ వ్యక్తం చేశారు. హీరో రమణ కు మంచి ఫ్యూచర్ ఉందని, అతను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని దర్శకుడు రవిచంద్రన్ కితాబిచ్చారు. తమ బ్యానర్ నుండి త్వరలో మరో రెండు సినిమాలు నిర్మించబోతున్నట్టు శిల్పిక తెలిపారు. ఈ చిత్రానికి డిజే నేహాల్ సంగీతం అందించారు.
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!