NTV Telugu Site icon

Vijay Leo Controversy: విజయ్ ఇచ్చిన మాట తప్పాడు.. లీయో పోస్టర్‌పై పొలిటీషియన్ విమర్శలు

Leo Poster Controversy

Leo Poster Controversy

PMK Leader Ramadoss Comments On Vijay Leo Poster: తమిళ నటుడు విజయ్ తాజాగా ‘లియో’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది లోకివర్స్‌లో ఓ భాగం కావడం, మాస్టర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి.. ఒక్కొక్కటిగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. రీసెంట్‌గా.. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘అలర్ట్ ఈగో, నా రెడీ’ అనే పాటను రిలీజ్ చేస్తున్నామంటూ ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ కన్ఫమ్ చేశారు. ఇందులో విజయ్ చేతిలో గన్ పట్టుకొని, సిగరెట్ తాగుతూ మాస్ అవతార్‌లో తళుక్కుమన్నాడు. ఈ పోస్టర్ అద్దిరిపోవడంతో.. విజయ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు ఈ పోస్టర్ వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడమే అందుకు కారణం. దీంతో.. తాను ఇచ్చిన వాగ్దానాన్ని విజయ్ తప్పాడంటూ.. పీఎంకే పార్టీ నేత రామదాసు విమర్శలు గుప్పించారు.

No Parking: నో పార్కింగ్‌కు ఫైన్లు కట్టి విసిగిపోయిన కార్ యాజమాని ఏం చేసాడో తెలుసా..!

‘‘2007లో, అలాగే 2012లో తన సినిమాల్లో తాను సిగరెట్ తాగే సీన్లు చేయనని హీరో విజయ్ వాగ్దానం చేశాడు. కానీ.. లియో సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ పోస్టర్‌లో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. స్మోకింగ్ సీన్లలో నటించడాన్ని విజయ్ నిరోధించాలి. ఎందుకంటే.. చిన్న పిల్లలు, విద్యార్థులు అతని సినిమాలు బాగా చూస్తారు. విజయ్ లాంటి స్టార్ హీరో సిగరెట్ తాగే సీన్లలో నటిస్తే.. అది పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తమ హీరో సిగరెట్ తాగుతున్నాడు కదా, మనమూ తాగుదామనే ఆలోచనే వాళ్లకు రావొచ్చు. స్మోకింగ్ నుంచి ప్రజల్ని రక్షించే సామాజిక బాధ్యత కూడా అతనికి ఉంది. చట్టం కూడా అదే చెబుతుంది. కాబట్టి.. తాను వాగ్దానం చేసినట్టు, విజయ్ స్మోకింగ్ సీన్లలో నటించకూడదు’’ అంటూ రామదాసు ట్విటర్ మాధ్యమంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమాని సినిమాలాగే చూడాలని, ఇలా రాద్ధాంతం చేయకూడదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం.. రామదాసు చెప్పింది నిజమేనంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

Box Office Report: థియేటర్లలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఆదిపురుష్