Site icon NTV Telugu

PK SDT: కేతికా, ప్రియా ప్రకాష్ వారియర్… ఇద్దరూ సుప్రీమ్ హీరోకే

Pk Sdt

Pk Sdt

మెగా మామ అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. తమిళ వర్షన్ లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు మార్కెట్ కి, పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ మూలకథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. అలా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారో లేదో కానీ అంతలోనే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ మెగా అభిమానులని ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది అని అప్డేట్ ఇచ్చిన మేకర్స్, తాజాగా ఈ రీమేక్ లో నటిస్తున్న కాస్ట్ డీటైల్స్ ని రివీల్ చేశారు.

చాలా రోజుల తర్వాత హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్న ఈ మూవీలో రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హీరోయిన్స్ గా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, గ్లామర్ క్వీన్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు సాయి ధరమ్ తేజ్ కోసమే కావడం విశేషం. ఈ ఇద్దరిలో ఒకరు తేజ్ కి వైఫ్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, మరొకరి తేజ్ కి ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నారు. ఒరిజినల్ సినిమా ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ ఉండే అవకాశం లేదు. మరి త్రివిక్రమ్ చేసిన మార్పుల ప్రకారం కొత్త క్యారెక్టర్స్ వస్తాయేమో చూడాలి.

Exit mobile version