NTV Telugu Site icon

Pisachi-2 Teaser : నగ్నంగా కనిపించిన స్టార్ హీరోయిన్.. ?

Andrea

Andrea

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని మూడు గంటలు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్.  నటుడిగా దర్శకుడిగా తనదైన శైలి చిత్రాలని రూపొందిస్తున్న మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.,. పూర్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పిశాచిగా ఆండ్రియా భయంకరమైన రూపం ఎంతటి పెద్దవారికైనా చెమటలు పట్టించేలా ఉంది. రెడ్ థీమ్ లైట్ లో వచ్చిన సన్నివేశాలు.. వాటికి కార్తీక్ రాజా నేపథ్య సంగీతం తోడై మరింత భయాన్ని కలిగిస్తోంది.

ఒక ఊరి చివరన ఉండే ఇల్లు.. ఆ ఇంట్లో పూర్ణ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇక ఆ ఇంట్లో ఉండే పిశాచి పిల్లలకు కనిపిస్తూ ఉంటూ ఇంట్లో సమస్యలను తెస్తోంది. ఆ పిశాచి నుంచి కుటుంబాన్ని కాపాడడానికి విజయ్ సేతుపతి ప్రయత్నిస్తూ ఉంటాడు. అస్సలు ఆండ్రియా పిశాచిలా ఎందుకు మారింది..? ఆ కుటుంబాన్ని ఎందుకు హింసిస్తుంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ తోనే మిస్కిన్ భయపెట్టాడని చెప్పాలి.  ఇక సినిమాకు హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు వెళితే ఖచ్చితంగా గుండె ఆగిపోతుందని చెప్పొచ్చు. ఇకపోతే తెలుగులో ఈ సినిమాకను దిల్ రాజు డబ్ చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆండ్రియా నగ్నంగా నటించిందని అంతకు ముందు వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే టీజర్ లో అయితే అలంటి షాట్స్ ఏమి చూపించలేదు కానీ ట్రైలర్ లో ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి.  మరి పిశాచి లానే ఈ పిశాచి 2 కూడా హిట్ టాక్ అందుకుంటుందేమో చూడాలి.

Show comments