NTV Telugu Site icon

Tamayo Perry: సొర చేపల దాడిలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు మృతి

Actor Tamayo Perry Passed Away

Actor Tamayo Perry Passed Away

Pirates Of The Caribbean Actor Tamayo Perry Passed Away In Shark Attack:’పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు తమయో పెర్రీ హవాయిలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు షార్క్ దాడిలో మరణించారు. అతని వయసు 49 సంవత్సరాలు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ స్టార్, లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ శిక్షకుడు తమయో పెర్రీ హవాయిలో మరణించారు. ‘బ్లూ క్రష్’ మరియు ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు తన 49 సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. నటుడు తమయో పెర్రీ జూన్ 23, ఆదివారం మధ్యాహ్నం గోట్ ఐలాండ్ సమీపంలో ఘోరమైన షార్క్ దాడికి గురయ్యాడు, ఆ తర్వాత మరణించాడు. ఓషన్ సేఫ్టీ లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ బోధకుడుగా తమయో పెర్రీ వ్యవహరిస్తున్నారు.

Ananya Nagalla : సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..

హవాయిలోని ఓహు సమీపంలోని గోట్ ఐలాండ్ సమీపంలో షార్క్ అతనిపై దాడి చేసింది. ఓ వ్యక్తి తమయో పెర్రీని చూసి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జెట్ స్కీలో అతన్ని ఒడ్డుకు చేర్చారు, కాని అతను మరణించినట్లు ప్రకటించారు. తమయో పెర్రీ శరీరంపై అనేక షార్క్ కాటు గుర్తులు ఉన్నాయి. నటుడి మరణం తర్వాత ఓషన్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతంలో షార్క్ హెచ్చరికలను పోస్ట్ చేశారు. నార్త్ షోర్‌లో లైఫ్‌గార్డ్‌గా పనిచేస్తున్న తమయో పెర్రీ, జూలై 2016లో ఓషన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆన్ స్ట్రేంజర్ టైడ్స్’ అనే పైరేట్స్ సినిమాలో పెనెలోప్ క్రజ్, జియోఫ్రీ రష్ మరియు ఇయాన్ మెక్‌షేన్ కూడా నటించారు.

Show comments