Pindam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో రిలీజ్ అయిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక.అంటే చాలా భయపెట్టే సినిమా అని అర్ధం. ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరామ్ మరియు ఖుషీ రవి జంటగా నటించారు.ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు మరియు అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.ఈ సినిమాకు మొదట మిక్స్‌డ్ టాక్‌తో రివ్యూలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగానే ఆదరించారు.పిండం మూవీ మేకర్స్ ట్రైలర్‌తో మూవీపై అంచనాలు పెంచేసారు..అయితే ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది.
పిండం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. పిండం మూవీనీ న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.పిండం ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది., అందుకు తగిన డీల్, ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. పిండం’ మూవీ కథ విషయానికి వస్తే, ఆంథోని(శ్రీరామ్) ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తాడు. అతడి భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. అది చాలా పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి వారు కొనుగోలు చేస్తారు.. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు అవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథాశంతో ఈ మూవీ రూపొందింది. పిండం మూవీని ప్రస్తుత కాలంతోపాటు 1990 మరియు 1930 లలో ఇలా మూడు కాలక్రమాలలో జరిగిన కథగా తెరకెక్కించారు. అయితే థియేటర్స్ లో పర్వాలేదనిపించిన పిండం మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
తాజావార్తలు
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..