NTV Telugu Site icon

Dhanush: పిక్ ఆఫ్ ది డే.. వారసులతో ధనుష్ ‘సార్’

Dhanush

Dhanush

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొట్ట మొదటి తెలుగు స్ట్రైట్ చిత్రం సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగాసితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కే ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా ఫిబ్రవరి 17 న ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ శనివారం రాత్రి చెన్నెలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ధనుష్.. కెప్టెన్ మిల్లర్ లుక్ లో ప్రత్యక్షమయ్యాడు. ఏ ఈవెంట్ కు అయినా హీరోనే స్పెషల్ ఎట్రాక్షన్.. కానీ ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు ధనుష్ వారసులు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముద్దుల మనవళ్లు.. ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ పిల్లలు లింగా ధనుష్, యాత్ర ధనుష్.

ధనుష్- ఐశ్వర్య.. భార్యాభర్తలుగా విడిపోయినా . పిల్లలకు మాత్రం తల్లిదండ్రుల ప్రేమకు మాత్రం దూరం చేయలేదు. వారి స్కూల్స్ ఫంక్షన్స్ కు తల్లిదండ్రులు లానే అటెండ్ అవుతున్నారు. ఇక తాజాగా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ఇద్దరు వారసులు హంగామా చేశారు. ధనుష్ కు చెరో పక్క కూర్చొని.. ఈవెంట్ ను ఎంజాయ్ చేశారు. ఇక ధనుష్ చాలా రోజుల తరువాత కొడుకులతో ఒక ఈవెంట్ లో కనిపించేసరికి కెమెరాలు తమ కంటికి పనిచెప్పాయి. ముగ్గురును మంచి మంచి యాంగిల్స్ లో జూమ్ చేస్తూ క్లిక్ మనిపించేశారు ఫొటోగ్రాఫర్లు. తండ్రికి తగ్గ అందం, హుందాతనం.. వీరిద్దరిలో కనిపించాయి. ముఖ్యంగా ముగ్గురు రుద్రాక్ష మాలను మేడలో ధరించి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకే ఫ్రేమ్ లో ధనుష్ తన వారసులతో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను ట్రెండింగ్ లోకి మార్చేశారు. ప్రస్తుతం లింగా, యాత్ర చదువుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి తాత, తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనలోకి అడుగులు వేస్తారో.. తల్లి దారిలో వెళ్తూ డైరెక్టర్ గా మారతారో చూడాలి.

Show comments