Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Peter 2026 Movie

Peter 2026 Movie

Crime Thriller OTT  : ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తోంది. కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాకు చెందిన మడికేరి, భాగమండల పరిసరాల్లోని దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య ఈ సినిమాను షూట్ చేశారు. ఈ లొకేషన్లు కథలోని సస్పెన్స్, క్రైమ్ మూడ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. ఒక సాంప్రదాయ ‘చేండే’ వాయించే డ్రమ్మర్ చుట్టూ తిరిగే సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్ ఇది. ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? ఆనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘పీటర్’ (Peter) 2026లో విడుదలైన ఒక కన్నడ సస్పెన్స్ క్రైమ్ డ్రామా సినిమా. ఈ చిత్రానికి సుకేష్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ‘వృద్ధి స్టూడియోస్’ బ్యానర్‌పై నిర్మించగా, కన్నడ ఇండస్ట్రీలో పేరున్న ‘KVN ప్రొడక్షన్స్’ సంస్థ దీని డిస్ట్రిబ్యూషన్ తీసుకుని భారీ స్థాయిలో థియేటర్లలోకి రిలీజ్ చేసింది. ఈ సినిమా 2026 జూన్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్ స్క్రీన్స్ పై ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్.

×
×
Ad

‘పీటర్’ మూవీ కథ

కన్నడ సినిమా ‘పీటర్’ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఈ కథ కేరళ సరిహద్దులోని కాసరగోడ్ నుండి పీటర్ (రాజేష్ ధ్రువ) అనే యువకుడు తన గతాన్ని ఎదుర్కోవడానికి, మంచు కొండల కూర్గ్ (మడికేరి) లోని తన సొంత ఊరికి తిరిగి రావడంతో ప్రారంభమవుతుంది. ఊళ్లోకి అడుగుపెట్టగానే తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న తన తల్లి మేరీని, తాగుడుకు బానిసైన తండ్రిని అతను కలుస్తాడు. గతంలో పీటర్ ఆ ఊరిలో అందరికీ ఇష్టమైన వ్యక్తి, అలాగే స్థానిక దేవాలయ ఉత్సవాల్లో ‘చెండే డ్రమ్స్’ వాయించే ఒక కళాకారుడు కూడా. ఆ సమయంలోనే మీరా (రవీక్షా శెట్టి) అనే కాలేజీ అమ్మాయి అతని వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమలో పడుతుంది.

ఇక వీరిద్దరి ప్రేమకథతో పీటర్ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. స్థానిక గుడి ఉత్సవాల నేపథ్యంలో పీటర్ స్నేహితులు, శత్రువుల మధ్య పెద్ద గొడవలు మొదలవుతాయి. ఈ గొడవల కారణంగా జరిగిన ఒక ఘోరమైన క్రైమ్ సంఘటన వల్ల పీటర్ ఒక పెద్ద తప్పు చేశాడని ఊరి జనం భావించడంతో, అతను తన ప్రేమను, ఊరిని వదిలి కాసరగోడ్ పారిపోవాల్సి వస్తుంది. ఆ మనో వేదనతో అతని తల్లి మానసిక స్థితి కూడా తప్పుతుంది. దర్శకుడు సుకేష్ శెట్టి ఈ కథను నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో నడిపించారు. తన సొంత ఊరికి తిరిగొచ్చిన పీటర్ తనపై పడిన నిందను ఎలా తొలగించుకున్నాడు ? తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు ? అనేదే ఈ సినిమా ముగింపు.