Site icon NTV Telugu

OTT Updates: ‘పెళ్లిసందD’ ఓటీటీ డేట్ వచ్చేసింది..!!

Pellisandadi

Pellisandadi

హీరో శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు దాటిపోయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ల‌ తర్వాత అదే పేరుతో వ‌చ్చిన సినిమాలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రీలీల‌ హీరోయిన్‌గా న‌టించింది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయన శిష్యురాలు గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా బ్రహ్మాండమైన వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

చాన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ‘పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రెడీ. ముహూర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే’ అంటూ జీ5 స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ ట్వీట్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లిసందD మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూశాం అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.

https://twitter.com/ZEE5Telugu/status/1539224889609297920

Exit mobile version