Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..

Peddi

Peddi

మెగా పవర్‌స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా నేడు  పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం ఈ చారిత్రాత్మక వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది.

ఈ మెగా ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనతో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. వీటికి తోడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్‌లను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో  ఈ రోజు విజయవాడలో జరగబోయే ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోయే సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారేమో చూడాలి. బెజవాడ వేదికగా జరుగుతున్న పెద్ది ప్రీ రిలీజ్ వేడుకకోసం అనేక ప్రాంతాల నుండి మెగా అభిమానులు తరలివస్తున్నారు.

×
×
Ad