Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది.  జూన్ 4న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, ఓవర్‌సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో మాత్రం ట్రేడ్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ఓవర్‌సీస్ మార్కెట్‌లో భారీ నష్టాల దిశగా పయనిస్తోంది.

సినిమాపై ఉన్న క్రేజ్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కారణంగా నార్త్ అమెరికా మరియు ఓవర్‌సీస్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అయితే, అక్కడ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కానీ, లాంగ్ రన్ కానీ లభించలేదు. వాస్తవంగా ప్రీమియర్ తో పాటు మొదటి రోజు కలిపి ఈ సినిమా 4మిలియన్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేయగా ఇప్పుడు లాంగ్ రన్ ముగిసే సరికి వచ్చే మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ ఆ ఫిగర్‌కు అటు ఇటుగా ఉండేలా కనిపిస్తోంది. ఈ వసూళ్లు ట్రేడ్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసే విషయమే. ‘పెద్ది’ సినిమా ఓవర్‌సీస్ బాక్సాఫీస్ వసూళ్లు ట్రేడ్ రంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో సినిమాలను కొనుగోలు చేసేటప్పుడు, బయ్యర్లు పెట్టే భారీ పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా మార్కెట్ కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉందని ఈ సినిమా స్పష్టం చేస్తోంది. తెలుగు స్టేట్స్ లో పర్వాలేదనే విధంగా వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, ఓవర్‌సీస్,నాన్ తెలుగు స్టేట్స్ బయ్యర్లకు మాత్రం ఈ సినిమా పెద్ద ఎదురుదెబ్బగానే మిగిలిపోనుంది.

×
×
Ad