NTV Telugu Site icon

Pedda Kaapu: అడ్డాలకు హ్యాండ్ ఇచ్చింది ఈ నటుడే.. ?

Srikanth

Srikanth

Pedda Kaapu: మంచితనానికి మారుపేరులా ఉండేవాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధం.. బంధాలు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ తీసి ప్రేక్షకులను బంధాలతోనే కట్టిపడేసేవాడు. అలాంటి డైరెక్టర్ నారప్ప సినిమాతో మాస్ లోకి దిగాడు. ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నారప్పతో చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా రీమేక్ అయినా కూడా వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్.. అడ్డాల చూపించిన విధానానికి తెలుగువారు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత దాన్ని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్దకాపు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో విలన్ గా శ్రీకాంత్ అడ్డాలనే కనిపించడంతో సినిమాపైమరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే మొదట శ్రీకాంత్ ఈ సినిమాలో నటించాలని అనుకోలేదట. ఒక మలయాళ స్టార్ నటుడును దించాలని చూశాడట. చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇచ్చేసరికి ఆ పాత్ర ఆయన చేయక తప్పలేదని సమాచారం.

Pooja Bhatt: తండ్రితో లిప్ లాక్.. సిగ్గులేదు.. హీరోయిన్ ఏమన్నదంటే ..?

ఇక ఆ నటుడు ఎవరో కాదు.. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. మాలీవుడ్ లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అంటే ఈయన పేరు చెప్పొచ్చు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి సినిమాలను చేస్తున్న.. సౌబిన్ ను పెద్దకాపు లో విలన్ గా ఎంపిక చేశారట. అయితే మొదటిరోజు షూటింగ్ కు ఆయన రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరిని తీసుకురాలేక శ్రీకాంత్ అడ్డాలను చేయమని చెప్పడంతో.. ఆయనే ఈ పాత్ర చేయాల్సివచ్చిందని టాక్. సౌబిన్ ఉంటే సినిమాపై హైప్ వచ్చేదో రాదో తెలియదు కానీ, అడ్డాల విలన్ గా కనిపించేసరికి సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. సెప్టెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల.. నటుడిగా, డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడా.. ? లేదా అనేది చూడాలి.

Show comments