Site icon NTV Telugu

Payal Rajputh: ఆ వ్యాధితో బాధపడుతున్నా.. సర్జరీ చేయాలనీ డాక్టర్స్ చెప్పారు

Payal

Payal

Payal Rajputh: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, అన్ని ఆర్ఎక్స్ 100 లో ఇందు లాంటి పాత్రలు రావడం.. వాటిని పాయల్ కూడా అంగీకరించడంతో.. అలాంటి పాత్రలకే ఆమె పరిమితం అయ్యిందని అనుకున్నారు అభిమానులు. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గా ఉంటూ.. అందాల ఆరబోతతో కుర్రకారును మెప్పిస్తూనే ఉంది. ఎలాగైనా మొదటి సినిమా లాంటి హిట్ ను అందుకోవాలని పాయల్ కష్టపడుతుంది. అందులో భాగంగానే తనకు మొదటి హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఆమె నమ్ముకుంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం మంగళవారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాయల్.. తనకున్న వ్యాధి గురించి బయటపెట్టింది. ఆమె కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతుందట.

Allu Arjun: పార్టీని పక్కకు పెట్టి.. దిల్ రాజు ఇంటికి వెళ్లిన బన్నీ

” అజయ్‌ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్‌ అయ్యే టైమ్​కు నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. డాక్టర్స్ ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సిందే అని సూచించారు. అయితే అజయ్‌ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను అని చెప్పాను” అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. “నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో మంగళవారం సినిమా వచ్చింది. నన్ను ఆర్ఎక్స్ 100 తో నన్ను అజయ్ భూపతి లాంచ్ చేశారు. అది నా కెరీర్ మార్చింది. ఇప్పుడు మంగళవారంలో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థాంక్స్” అని చెప్పింది. మరి ఈ సినిమాతో పాయల్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version