హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.బెడ్పై టెంప్టింగ్ ఫోజులిస్తూ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మొదట్లో సీరియల్ నటిగా తన కేరీర్ ను ప్రారంభించింది. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. సీరియల్స్ తో వచ్చిన పాపులరిటీ తో పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.అక్కడ ఆ చిత్రం తో మంచి గుర్తింపు సాధించింది.ఆ తరువాత తెలుగులో ‘ఆర్ ఎక్స్ 100′ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో కార్తీకేయ సరసన బోల్డ్ పెర్ఫామెన్స్ చేసి రచ్చ చేసింది.తెలుగు లో మొదటి చిత్రం తోనే అద్భుత విజయం సాధించింది .’ఆర్ ఎక్స్ 100’ తరువాత ఈమెకు తెలుగు లో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజామరియు జిన్నా వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆమెకు గుర్తింపు ఇవ్వలేకపోయాయి.దాంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.
ఈమె తెలుగుతో పాటు తమిళం, పంజాబీ మరియు కన్నడ చిత్రాల్లో కూడా నటించింది.. తెలుగు లో మరోసారి ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ ను అందుకునేందుకు రెడీ అయింది.. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ‘మంగళవారం’ సినిమాలో నటిస్తోంది.ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది.సెమీ న్యూడ్ గా కనిపించి పాయల్ అందరికి షాకిచ్చింది. మరో వైపు ఎమోషనల్ గా ఈ సినిమా సాగుతుందని సమాచారం.. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతుంది సినిమాలలో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలతో రచ్చ చేస్తోంది పాయల్.వరుస ఫొటోషూట్ల తో రెచ్చగొడుతుంది.. తాజాగా బెడ్ పై టెంప్టింగ్ ఫోజులతో హీటెక్కించింది.ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.