Site icon NTV Telugu

చివరికి ‘క్యాబరే డాన్సర్’ గా మారిన పాయల్ రాజ్ పుత్..?

payal rajput

payal rajput

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్.. గాఢ ముద్దు సన్నివేశాల్లో అవలీలగా నటించేసి బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడికి అవాకాశాలు అయితే వచ్చాయి కానీ విజాయ్లు మాత్రం అందలేదు. ఒక పక్క హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది ఈ బ్యూటీ.. ఇక తన అందచందాలను ఆరబోయడానికి సోషల్ మీడియా ఎలాగూ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఈ భామ ప్రస్తుతం క్యాబరే డాన్సర్ గా మారిపోయిందంట.. ప్రస్తుతం పాయల్ కన్నడ లో హెడ్ బుష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.

కన్నడ స్టార్ హీరో ధనుంజయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమ్మడు క్యాబరే డాన్సర్ గా కనిపించబోతున్నదంట.. ప్రస్తుతం పాయల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. స్టార్ హీరో సినిమా.. అందులోను పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఈ మూవీ హిట్ అయితే తనకు పేరు వస్తుంది.. అందుకే పాత్ర ఎలాంటిదైనా ఒప్పుకొన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కన్నడలో ఈ బ్లోడ్ బ్యూటీ దశ తిరిగినట్లే.. మరి పాయల్ కెరీర్ ని ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పబోతుందో చూడాలంటే ఈ చిత్రం విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.

Exit mobile version