Payal Rajput : ఈ నడుమ సెలబ్రిటీల ఇళ్లలో క్యాన్సర్ అనే వార్త తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా స్టార్ హీరోయిన్ తండ్రిని కూడా క్యాన్సర్ సోకింది. తాజాగా పాయల్ రాజ్ పుత్ తన తండ్రికి క్యాన్సర్ సోకినట్టు తెలిపింది. మంగళవారం సినిమాతో పాయల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ భామ.. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అయితే తాజాగా తన తండ్రికి జీర్ణాశయ క్యాన్సర్ సోకిందని ఇన్ స్టా ద్వారా తెలిపింది. తన తండ్రికి ఇప్పటికే కీమో థెరపీ కూడా అయిందని చెప్పుకొచ్చింది. హాస్పిటల్ లో సెలైన్ ఎక్కుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన తండ్రి చేతిలో తన చేతిని పెట్టుకుని ఎమోషనల్ పోస్టు చేసింది.
Read Also : SSMB 29: SSMB29పై ట్రంప్ ఎఫెక్ట్..జక్కన్న అలెర్ట్!
ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఆమె తండ్రి కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. పాయల్ రాజ్ పుత్ తెలుగులో ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే భారీ హిట్ అందుకున్నా.. బోల్డ్ బ్యూటీ అనే ముద్ర వేసుకుంది. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా రావడం వల్ల.. కెరీర్ లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇక మంగళవారం సినిమాతో పాయల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పాయల్ అటు తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది.
