Site icon NTV Telugu

Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్.. ఈసారి గౌతమ్ గంభీర్ గుట్టు రట్టు చేసిందే

Payal

Payal

Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తమన్నా ఫ్రెండ్ గా నటించినా కూడా హీరోయిన్ కు ధీటుగా ఉండే పాత్రే కాబట్టి.. అమ్మడికి కూడా మంచి గుర్తింపునే లభించింది. ఈ సినిమా తరువాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పాయల్.. ఆ తరువాత బాలీవుడ్ లోనే పాగా వేసింది. ఇక అమ్మడు సినిమాల కంటే.. వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై ఘాటు ఆరోపణలు చేసి మరింత పేరు తెచ్చుకుంది. లైంగిక వేధింపులు బాలీవుడ్ లో చాలా ఉన్నాయని.. ఎన్నో సినిమాలు దీని వలనే వదిలేసుకోవాల్సి వచ్చిందని ఆమె నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈ భామ అనురాగ్ కశ్యప్ ను వదిలి.. గౌతమ్ గంభీర్ మీద పడింది.

ED Officer Arrest: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

తాజాగా ఆమె క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం నెట్టింట వైరల్ గా మారింది. 2011 లో పాయల్.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో రిలేషన్ లో ఉంది. ఈ జంట దాదాపు ఐదేళ్లు కలిసి తిరిగారు. ఇక ఆ సమయంలోనే పాయల్ కు మరో క్రికెటర్ అయిన గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడని ఆమె ఎక్స్ వేదికగా తెలిపింది. ” నేను 2011 నుంచి ఐదేళ్ల పాటు ఇర్ఫాన్ పఠాన్‌తో డేటింగ్‌లో ఉన్నా.. తరువాత అదంతా ముగిసిపోయింది. ఆ సమయంలోనే గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్ కూడా నేనంటే ఇష్టపడ్డారు. కానీ నేను ఇర్ఫాన్‌ను మాత్రమే ప్రేమించాను. నేను అతనిని తప్ప మరెవరినీ ప్రేమించలేకపోయా.. అతని తరువాత కూడా ఎవరిని ఇష్టపడలేదు. నేను ఇర్ఫాన్‌కి అన్ని విషయాల గురించి చెప్పాను. గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన మిస్‌డ్ కాల్స్ వివరాలు కూడా చూపించా. ఇర్ఫాన్‌కు అన్నీ తెలుసు. అతను నా ఫోన్‌కాల్స్ పరిశీలించేవాడు. ఒక మ్యాచ్ కోసం ఇర్ఫాన్ పఠాన్ పుణెలో ఉన్నప్పుడు నేను అతన్ని కలిశా. ఆ సమయంలో తన సోదరుడు యూసఫ్ పఠాన్, హార్దిక్, కృనాల్ పాండ్యా ముందు కూడా ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కానీ అక్షయ్ కుమార్ ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అతనో పెద్ద స్టార్. అందుకు ఆయనను ఎప్పుడూ గౌరవిస్తా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version