Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతాడా.. ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నాడు. రేపు జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నాడు. ఇన్ని రోజులు తాను ఎందుకు ప్రమోషన్లలో పాల్గొనలేదో ఆ విశేషాలు కూడా పంచుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఆలస్యానికి కారణాలు, క్రిష్ తప్పుకోవడం, మూవీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రమోషన్లు చేయకపోవడానికి కారణాలు కూడా వివరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అసలే పవన్ మొదటిసారి మూవీ గురించి మాట్లాడబోతున్నాడు.
Read Also : Sreeleela : అదే తప్పు చేస్తున్న శ్రీలీల.. ఫ్యాన్స్ హర్ట్..
కాబట్టి చాలా విషయాలు బయటకు లాగేందుకు మీడియా ట్రై చేస్తుంది. పవన్ చేసే కామెంట్లు రేపు సోషల్ మీడియాను ఊపేయడం ఖాయం. ఇక రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. దానికి చీఫ్ గెస్టులుగా రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నారు. ఈవెంట్ లో పవన్ చేసే స్పీచ్ గురించి ఆయన ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ ఏం చేశాడు.. ముందు రాబోయే సినిమాల గురించి కూడా స్టేట్ మెంట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తానికి పవన్ స్పీచ్, ప్రెస్ మీట్ తో రేపు సోషల్ మీడియాలో మార్మోగిపోవడం ఖాయం.
Read Also : Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..
