NTV Telugu Site icon

Pawan Kalyan: అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్టమస్ వేడుకలు.. ఫోటోలు వైరల్

Ana

Ana

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అనా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తకు తోడుగా ఆమె అనునిత్యం పవన్ వెనుకనే ఉంటుంది. తీన్ మార్ సినిమాతో ఆమె తెలుగుతెరకు పరిచయమైంది. ఆ షూటింగ్ సమయంలోనే పవన్ ను ప్రేమించిన ఆమె.. పెళ్లి చేసుకొని ఇండియాలోనే ఉండిపోయింది. ఇక సినిమాలకు దూరమైన ఆమె.. పిల్లలను చూసుకుంటూ ఉండిపోయింది. ఇక అనా.. క్రిస్టియన్ అని అందరికి తెలుసు. ప్రతి ఏడాది ఆమె క్రిస్టమస్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఏడాది ఆమె క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఇండియాలోనే జరుపుకోవడం విశేషం.

తాజాగా అనా కొణిదెల ప్రీ క్రిస్టమస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. చిన్నారులతో కలిసి ఆమె క్రిస్టమస్ వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలను జనసేన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. శ్రీమతి అనా కొణిదెల గారిని హోమ్ నిర్వాహకులు సత్కరించారు” అని రాసుకొచ్చారు.

Show comments