Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా పవన్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు క్రిష్‌తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్, స్టైలింగ్ అందరికీ నచ్చేశాయి. ఆయన రెడ్ టీ షర్ట్, జీన్స్, వాచీ, షూస్ ధరించి కనిపించడంతో అభిమానులు తమ హీరోను చూసి ఉప్పొంగిపోయారు.
Read Also:Unstoppable With NBK 2: బాలయ్య అన్‌స్టాపబుల్-2 ట్రైలర్ వచ్చేస్తోంది..!!
అయితే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచీ, షూస్ ధరపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. పవన్ ధరించిన వాచీ ఖరీదు రూ.14 లక్షలు ఉంటుందని.. అలాగే షూస్ ధర కూడా రూ.10 లక్షల వరకు ఉంటుందని కొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు. పవన్ పెట్టుకున్న వాచీ ఇటలీ సంస్థ పనేరాయ్ కంపెనీకి చెందిందని… సబ్ మెర్సిబుల్ కార్బోటెక్ 47ఎంఎం అనే మోడల్ వాచ్ కావడంతో ధర రూ.14,37 లక్షలు ఉంటుందని సమాచారం అందుతోంది. అటు పవన్ ధరించిన షూస్ కోపెన్‌హాగెన్ కంపెనీకి చెందినవి కావడంతో వీటి ధర మాత్రం రూ.9.6 లక్షల వరకు ఉంటుందని టాక్ నడుస్తోంది. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నాయికగా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.