NTV Telugu Site icon

Ramoji Rao: మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరిన పవన్

Pawan Kalyan Ramoji Rao

Pawan Kalyan Ramoji Rao

Pawan Kalyan to Pay Tributes to Ramoji Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే రామోజీరావు మరణించిన విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ లోని రామోజీరావు నివాసానికి వెళ్లి నివాళులర్పించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Ramoji Rao: రామోజీరావు నటించిన సినిమా ఏదో తెలుసా?

ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి రామోజీరావు మరణానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీరావు అంత్యక్రియలను లాంఛనంగా జరపాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య రామోజీ ఫిలిం సిటీ లోనే రామోజీరావు అంతిమ సంస్కారాలు జరపబోతున్నట్లుగా తెలుస్తోంది.

Show comments