Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి పవన్ ఎంతో కష్టపడుతున్నాడు. అయితే రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకు..? కొన్ని ఏళ్ళు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. మరి ఇప్పుడెందుకు రెండు పడవల మీద కాలు వేస్తున్నాడు అంటూ కొంతమంది పవన్ విమర్శిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చాడు. తాను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను అని, రాజకీయం దేశం కోసం చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. స్వంతంగా పార్టీని నడిపించాలని సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు చేసి వచ్చిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకరి దయాదాక్షిణ్యాలు ఒకరు ఇచ్చే ఫండింగ్ తో తన పార్టీ నడపడం ఇష్టం లేక తనకు తెల్సిన పనిని చేసి డబ్బులు తీసుకుంటున్నాను అని తెలిపాడు.
ఇక ఆ విధంగానే వరుస సినిమాలను ఒప్పుకొని డబ్బు తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లెమ్ ఏంటంటే.. డబ్బు అయితే తీసుకుంటున్నాడు కానీ షూటింగ్ లేట్ అవ్వడం వలన నిర్మాతలు బలి అవుతున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే భవదీయుడు భగత్ సింగ్ లైన్లో ఉంది. ఇప్పుడు సుజీత్ తో ఇంకో సినిమా ప్రకటించాడు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది తెలియదు. అయితే మేకర్స్ కూడా పవన్ ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్ పెట్టుకుంటామని, ఆయనను ఇబ్బంది పెట్టే ఆలోచనలు లేవు అని చెప్పడం విశేషం. హరిహరవీరమల్లు నిర్మాత ఎఎం రత్నం, పవన్ కు మూడేళ్ళ క్రితమే ఈ సినిమా కోసం డబ్బు ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఆయన మీద నమ్మకం ఉందని, అందుకే ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్ పూర్తిచేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. మరి పవన్ ఈ సినిమాలు ఎప్పుడు ముగిస్తాడో చూడాలి.
