NTV Telugu Site icon

Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ గా ఆయన రేంజ్ వేరు. ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయి. అయినా అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక జనసేన పార్టీని నడపడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాని అందరి ముందు చెప్పుకొచ్చారు. ఇంకో పక్క పవన్.. కొన్ని రాజకీయ పార్టీల ద్వారా ప్యాకేజీలు అందుకుంటున్నారని రూమర్స్ గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా పవన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లన్నింటికీ పవన్ చెక్ పెట్టారు. గతరాత్రి మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన పదవ ఆవిర్భావి దినోత్సవంలో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనిరేషన్ తో సహా మొత్తం చెప్పుకొచ్చారు.

Samantha: శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత

“కొన్ని రాజకీయ పార్టీలు నాకు రూ. 1000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు.. ఆ డబ్బులు కనిపించక వెతుక్కుంటున్నాను. అయినా నా రేంజ్ కి 1000 కోట్లు ఏమిటి పదివేల కోట్లు అంటే సరిపోయేదేమో అనుకుంటున్నాను. ఇక నేను చేసే సినిమాలకు రెమ్యూనిరేషన్ ఎంతెంత తీసుకొంటున్నానో కూడా చెప్పేస్తున్నారు. నేను 22 రోజులు సినిమాకు డేట్స్ ఇస్తే మొత్తంగా నాకు రూ. 45 కోరలు వస్తాయి. అంటే రోజుకు నేను రెండు కోట్లు తీసుకుంటున్నాను. ఈ స్థాయికి నేను ఎదిగాను అంటే దానికి కారణం అభిమానులే.

నాకు డబ్బు మీద ఆశ లేదు. నేను చూడని డబ్బా..? నాకు తెలియని సుఖలా..?” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గ మారాయి. ఇకపోతే పవన్ స్వయంగా తన రెమ్యూనిరేషన్ చెప్పుకురావడంతో అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. రోజుకు రెండు కోట్లు అంటే మాటలు కాదు.. అది పవన్ రేంజ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, వినోదాయ సీతాం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ ఓజి.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్స్ అన్ని పవన్ పూర్తి చేయనున్నారు. మరి ఈ సినిమాలు పవన్ కు ఎలాంటి విజయాలు అందిస్తాయి చూడాలి.

Read Also:Smriti Irani: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్