NTV Telugu Site icon

PK SDT: నెల రోజుల్లో కంప్లీట్ అయ్యింది… ఏప్రిల్ 5 నుంచి పవన్ ర్యాంపేజ్

Pk Sdt

Pk Sdt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మొదటి మల్టీస్టారర్ సినిమాని సముద్రఖని దర్శకత్వంలో వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా వినోదయ సిత్తంకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 22న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ‘PK SDT’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన సీన్స్ ని షూట్ చేసిన సముద్రఖని, ఎట్టకేలకి చెప్పిన సమయానికి పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ ని పూర్తి చేశాడు. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు డబుల్ కాల్ షీట్స్ కూడా షూట్ చేశాడు. ఒక సాంగ్ మినహా పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం పూర్తి అయ్యింది. ఇకపై సాయి ధరమ్ తేజ్ సీన్స్ ని షూట్ చెయ్యనున్నారు.

ఇన్ టైమ్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసి జూలై 28న ఆడియన్స్ ముందుకి తెచ్చేలా సముద్రఖని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ‘PK SDT’ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్, ఏప్రిల్ 6 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పల్స్ పర్ఫెక్ట్ గ తెలిసిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత అనౌన్స్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లు హరీష్ శంకర్ ఫ్యాన్ స్టఫ్ ని సినిమా మొత్తం ఫుల్ గా లోడ్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ రెగ్యులర్ అప్డేట్స్ ఏప్రిల్ 5 నుంచి రానున్నాయి.

Show comments