పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబో సినిమా వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించబడింది. అయితే ఆ సినిమా పత్రికల్లో చెప్పినట్లుగా పట్టాలెక్కలేదు. ఈ నేపధ్యంలో అభిమానులలో ఆ ప్రాజెక్ట్‌పై పెద్ద ఆతురత ఏర్పడింది. సురేందర్ రెడ్డి సినిమాలు స్టైలిష్, యాక్షన్, గ్రాండ్ సెట్స్ మరియు హీరోల సరికొత్త లుక్‌లో చూపించడంలో ముందుంటారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను పూర్తి చేసి, కొత్త ప్రాజెక్ట్‌కి డేట్స్ కేటాయించబోతున్నాడని టాక్. మరి ‘ఓజీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో స్క్రీన్‌పై రాణించిన పవన్, తన తదుపరి డెట్స్ సురేందర్ రెడ్డి కి కేటాయిస్తారా? అనే విషయంలో ఆసక్తి కరంగా మారింది. మరి ఇదే కనుక నిజం అయితే ఈ కొత్త ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడం ఖాయం..మరి ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్న ఈ కాంబినేషన్ నిజంగా స్ర్కీన్‌పై వస్తుందో వేచి చూడాల్సి ఉంది.
