Site icon NTV Telugu

Pawan Kalyan: ఒకపక్క రక్తం కారుతుంటే.. మత్తుమందు వద్దు పవన్ పాటలు పెట్టమన్న పేషేంట్.. షాకైన డాక్టర్లు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Songs played while stiching to wound of his fan at singarayakonda: మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన క్రేజ్. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగానే ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు కానీ పవర్ స్టార్ గా ఎదిగిన తీరు మాత్రం ఆయనకు అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టింది. మరీ ముఖ్యంగా ఖుషి సినిమా తర్వాత ఆయనకు యూత్ లో ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక ఇతర భాషల్లో ఆయన సినిమాలు డబ్బింగ్ అవడం తక్కువే కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి నివసించే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చాలామంది ఆయనకు అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అలా ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వీరాభిమాని ఉదంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఒరిస్సాకి చెందిన కిషోర్ చౌదరి అనే ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే అలా పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది.

BabyTheMovie: ఇందూకు చెల్లి దొరికిందిరోయ్.. అలా అయితే పాప పరిస్థితి కష్టమేరోయ్

దీంతో బాగా రక్తస్రావం అవుతున్న పరిస్థితుల్లో అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అయితే గాయం చూసి ముందు రక్తస్రావం ఆగేలా ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తలకు కుట్లు వేయాలని భావించాడు. అయితే మత్తు ఇంజక్షన్ ఇచ్చినా ఆ మత్తు పని చేయక పోవడంతో ఏదైనా వ్యాపకం ఉంటే నొప్పి తెలియదని, నీకు బాగా నచ్చినది ఏంటి అని అడిగితే పవన్ కళ్యాణ్ పాటలు అని చెప్పాడట సదరు అభిమాని. దీంతో ముందు అక్కడ ఉన్న డాక్టర్లు ఆ కంపెనీ యాజమాన్యం అవాక్కైనా సరే వెంటనే పాటలు పెట్టి కుట్లు వేయడం మొదలు పెట్టారు. ఇక అలా కుట్లు వేస్తున్న సమయంలో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది అలా పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు ఇదేమి అభిమానం రా స్వామి అని కామెంట్లు చేస్తుంటే పవన్ అభిమానులు మాత్రం పవన్ అనే పేరు ఒక మత్తు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.

Exit mobile version