Site icon NTV Telugu

Pawan Kalyan : వకీల్ సాబ్ నుంచి ఓజీ వరకు..పవన్ స్పీడ్ చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే

Pawankalya

Pawankalya

ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా, థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు.

Also Read :OG : పవన్ ఫ్యాన్స్‌కి కొత్త టెన్షన్..?

ఇతర స్టార్ హీరోలకు సినిమాలే జీవితం అయినా, వారి నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా కూడా రావడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో సినిమాలు విడుదల చేశారు. అంటే ప్రతి ఏడాదికి కనీసం ఒక సినిమా పవన్ నుంచి వచ్చింది.

2024 లో రాజకీయ బాధ్యతలు చేపట్టడంతో ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడం కష్టమని అనుకున్నారు. హరి హర వీరమల్లు ఆగిపోయింది, ఓజీ ఆలస్యం అవుతుంది.. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు జరగకపోవచ్చు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా కొద్ది నెలల్లోనే ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. జూలైలో హరి హర వీరమల్లు విడుదల కాగా, సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కూడా పూర్తి చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరిలో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. అలా రాజకీయ నాయకుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను వేగంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్‌ని చూసి, కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా మిగతా స్టార్ హీరోలు పూర్తి చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version