Site icon NTV Telugu

Pawan Kalyan : ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పోలీసులు ఎంతో శ్రమించారు

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్‌ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోకు సంబంధించి ఏ ఈవెంట్‌ను మిస్ చేసుకోరు. అందులో పవన్‌ కల్యాణ్‌ అంటే యువతో పాటు అన్ని వయసుల వాళ్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీ రిలీజ్‌ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా పవన్‌ కల్యాణ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సజావుగా సాగాడానికి ఎంతో కష్టపడిని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, జనసామాన్యానికి అవాంతరాలు లేకుండా చేయడంలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో తెలంగాణ పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అభినందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సాఫీగా జరగడంలో ఎంతో శ్రమించారని కొనియాడారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పీఎస్ ల పరిధిలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్ వివరించారు.

Exit mobile version