పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నచ్చిన సినీ అభిమాని ఉండడు. గబ్బర్ సింగ్ సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా అందరికీ నచ్చింది పవన్ కళ్యాణ్. అలీ ట్రాక్. ఈ ఇద్దరి మధ్య ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ వర్కౌట్ అయ్యింది గబ్బర్ సింగ్ సినిమాలోనే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫుల్ యాటిట్యూడ్ తో “అరెవో ఓ సాంబ రాస్కోరా…” అనగానే అలీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ … దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ కి థియేటర్స్ విజిల్స్ పడ్డాయి. ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది ‘బ్రో’ మూవీ. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మెగా మామ అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ లు కలిసి నటిస్తున్నారు.
రీమేక్ మూవీ అయినా ఆ ఫీలింగ్ రాకుండా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ కి సెట్ అయ్యేలా మార్పులు చేర్పులు చేయడంతో ‘బ్రో’ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జులై 28న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పీక్ స్టేజ్ లో ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా బయటకి వచ్చిన అప్డేట్ ప్రకారం… బ్రో మూవీలో “అరెవో సాంబ” స్టైల్ లోనే “అరెవో మార్క్.. రాస్కోరా” అనే డైలాగ్ ని పెట్టారట. మార్క్ అంటే సాయి ధరమ్ తేజ్ చేస్తున్న క్యారెక్టర్ పేరు. ఈ మామ అల్లుళ్లు స్క్రీన్ పైన ఎలాంటి హంగామా చేయబోతున్నారు అనేది మెగా అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ఇలాంటి ఫ్యాన్ స్టఫ్ పర్ఫెక్ట్ గా ప్లేస్ చేస్తే చాలు బ్రో మూవీ రీమేక్ అయినా ఫాన్స్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు.
