NTV Telugu Site icon

Pawan Kalyan: లడ్డూ కామెంట్స్ పై కార్తీ క్షమాపణలు.. స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Karthi

Pawan Kalyan Karthi

Pawan Kalyan Responds on Karthi Apologies on Laddu Comments: తిరుమల లడ్డు వ్యవహారం మీద హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీలైతే ఖండించండి కానీ ఇలా సున్నితమైన విషయం మీద కామెంట్లు చేయకూడదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీకి తెలుగు మీన్స్ చూపిస్తూ ఆయన స్పందన తెలియజేయమని యాంకర్ కోరింది. ఈ సందర్భంగా లడ్డు కావాలా నాయనా అనే మీమ్ చూపించినప్పుడు లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను స్పందించను అంటూ కార్తి చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత క్షమించాలంటూ కార్తీక్ చేశాడు. అయితే ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్, ఇప్పుడు స్పందించారు. నేను అన్న మాటలకు మీరు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు అలాగే మీరు సంప్రదాయాలు పట్ల చూపిస్తున్న గౌరవానికి నేను సిన్సియర్గా అప్రిషియేట్ చేస్తున్నాను.

Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు

తిరుమల తిరుపతి గురించి అక్కడి లడ్డు గురించి లక్షల మంది భక్తులు ఇప్పుడు బాధలో ఉన్నారు. అలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇదే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకోవాలనుకున్నాను అంతకు మించి ఏమీ లేదు మీరు ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడలేదు అని నేను అర్థం చేసుకున్నాను. కానీ పబ్లిక్ ఫిగర్స్ గా ఉన్నప్పుడు మన కల్చర్ గురించి స్పిరిచువల్ వాల్యూస్ గురించి మనమే ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే అవసరం ఉంది . ఒక అద్భుతమైన నటుడిగా మీరు అంటే నాకు చాలా ఇష్టం అని అంటూనే సత్యం సుందరం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అందులో పనిచేసిన నటీనటులకు దర్శకుడికి, నిర్మాతలకు సైతం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు.

Show comments