Site icon NTV Telugu

Pawan Kalyan: ముద్దుల మేనల్లుడును కూడా అలా పిలవాలా.. పవన్

Pawan

Pawan

Pawan Kalyan: మెగా కుటుంబానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తేజ్ కు కూడా మామయ్యలు అంటే ప్రాణం. తేజ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం మామయ్యలే.. ఆ కృతజ్ఞతను తేజ్ ఎప్పటికీ మర్చిపోడు. ఏ సినిమా అయినా.. స్టేజ్ ఏదైనా మామయ్యలను తలుచుకోకుండా, వారికి థాంక్స్ చెప్పకుండా మాత్రం కిందకు దిగడు. ఇక అంతే ప్రేమను మామయ్యలు తేజ్ కు అందిస్తారు. యాక్సిడెంట్ తరువాత తేజ్ కు అంతటి ధైర్యాన్ని ఇచ్చింది వాళ్లే. రిపబ్లిక్ సినిమా సమయంలో మెగా కుటుంబం మొత్తం తేజ్ కు అండగా నిలబడింది. ఇక ఇప్పుడు కూడా తేజ్ రీ బర్త్ తరువాత రిలీజ్ అయిన విరూపాక్ష హిట్ అందుకోవడంతో మామలు మేనల్లుడును చూసి గర్వపడుతున్నారు. తేజ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చిరంజీవి.. విరూపాక్ష హిట్ అయ్యినందుకు తేజ్ కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.

పవన్ ట్వీట్ చేయలేదు కానీ, తేజ్ కు ఒక పుష్ప గుచ్ఛాన్ని పంపి కంగ్రాట్స్ తెలిపాడు. ” డియర్ తేజ్ గారు.. విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ అయ్యినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ కార్డు మీద రాసి పంపాడు. ఇక పెద్ద మామ ట్వీట్ కే ఉబ్బితబ్బిబై పోతున్న తేజ్ కు చిన్నమామ ఏకంగా పూలు పంపించి కంగ్రాట్స్ చెప్పడంతో మరింత సంతోషిస్తున్నాడు. “చాలా థాంక్స్.. చిన్న మామ.. ఎంతటి అద్భుతమైన రోజు .. విరూపాక్ష నాకు
ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను అందించింది. పెద్ద మామ నుండి ప్రశంసలు అందించింది. ఇప్పుడు మీ ప్రేమను, అద్భుతమైన మాటలను, ప్రశంసలను అందించింది. నేనెప్పుడూ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, పవన్ ఆ కార్డు లో తేజ్ ను కూడా గారు అని పిలవడం అద్భుతంగా ఉంది కానీ, మనకన్నా చిన్నవారిని, బంధువులను ఆశీర్వదించేటప్పుడు గారు ఎందుకు పవన్.. మేనల్లుడే కదా.. తేజ్ అంటే సరిపోతుంది కదా అని కొందరు చెప్పుకొస్తుండగా.. రెస్పెక్ట్ అనేది అందరికి ఇవ్వాలి. అందుకే పవన్ అందరికి ఆ రెస్పెక్ట్ ఇస్తాడు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అభిమానుల హిట్ టాక్.. తనకు నచ్చిన ఇద్దరు మామయ్యల ప్రశంసలు అందుకున్న తేజ్ మాత్రం గాల్లో తేలిపోతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక పవన్- తేజ్ కలిసి.. వినోదాయ సీతాం రీమేక్ లో నటిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version