Site icon NTV Telugu

Pawan Kalyan: ఏపీలో పొలిటికల్ హీట్… అయోమయంలో పవన్ సినిమాల షూటింగ్స్…

Pawan Kalyan

Pawan Kalyan

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బంద్ లు, నిరసనలతో రాష్ట్రం వార్ జోన్ లో ఉన్నట్లు ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చి, పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ముఖ్యంగా OG షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది, ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు.

అలా షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపొయింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక హరిహర వీరమల్లు పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే క్వేషన్ లో ప్రపంచంలో ఎవరి దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ మరి కొన్ని రోజుల పాటు కంటిన్యూ అయితే పవన్ సినిమా షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ చేసే అవకాశమే లేదు. సినిమాలని కొన్ని రోజులు పూర్తిగా పక్కన పెట్టేసి పవన్ పాలిటిక్స్ పైనే ద్రుష్టి పెడతాడు. ఒకవేళ వీలైతే OG షూటింగ్ ని మాత్రమే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు మాత్రం కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు.

Exit mobile version