Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో .. ఇంకోపక్క సినిమాలతో చాలా బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సుజీత్ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. నిత్యం ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసాడు. ఇక పవన్ సినిమా అంటే.. షెడ్యూల్ కు షెడ్యూల్ కు మధ్య ఓ రేంజ్ లో గ్యాప్ ఉంటుంది. మధ్యలో పవన్ రాజకీయ ప్రచారాలు.. అవి ఇవి ఉండడంతో నిదానంగా సినిమాను ఫినిష్ చేస్తున్నారు అనుకున్నారు అంతా.. కానీ, సుజీత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ కన్నా ఎక్కువగా స్పీడ్ పెంచేస్తున్నాడు.
Kashmira Shah: 14 సార్లు నా భర్తతో ట్రై చేశా.. చివరికి ఆ స్టార్ హీరో వలనే తల్లిగా మారాను
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను ఫినిష్ చేసిన సుజీత్.. తాజాగా నాలుగో షెడ్యూల్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ సుజిత్ పాటు డీఓపీ కూడా ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ” లైట్స్, కెమెరా.. కొద్దిగా డ్రామా.. OG నాల్గవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం హాజరయ్యారు. మరి కొన్ని నెలలు వేచి ఉండండి. ఇది కచ్చితంగా మీకు పిచ్చెక్కిస్తుంది” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అభిమానులు ఈ అప్డేట్ చూసి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వేగం చూస్తుంటే.. మెంటలెక్కిపోతుందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.