NTV Telugu Site icon

Chiranjeevi – Pawan: చిరు కాళ్ళపై పడ్డ పవన్.. ఏడ్చేసిన నాగబాబు

Pawan Kalyan Chiranjeevi Nagababu

Pawan Kalyan Chiranjeevi Nagababu

Pawan Kalyan Met Chiranjeevi at His House: ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించినా, అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనతో పాటు జనసేనకు 20 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నారు. దీంతో ఎన్డీఏలో ఆయనకు కూడా మంచి ప్రాధాన్యత లభిస్తుంది. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఢిల్లీ షటిల్ సర్వీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.

Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

అక్కడ మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులందరితో సమయం వెచ్చించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలవగానే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు కళ్ళు చమర్చగా కళ్ళు తుడుచుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. కుటుంబ సభ్యులందరూ ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య నిహారిక సహా అందరూ పాల్గొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ వెంట తన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరా నందన్ కూడా ఉన్నారు. ఇక ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కళ్ళల్లో ఆనందం చాన్నాళ్ల తర్వాత కనిపించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments